దురుసుగా ప్రవర్తించిన పురోహితులపై పిర్యాదు
పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ మున్సిపల్ పరిధిలో
లింబాద్రి గుట్ట బ్రహోత్సవాల్లో విధి నిర్వహణ చేస్తున్న విలేకరులు, అధికారులు, భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించిన పంతుల్లపై పోలీసులకు పిర్యాదు చేశారు. గురువారం భీంగల్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పోలీసులను కలిశారు. పట్టణానికి చెందిన రిపోర్టర్లు కొందరు జాతర ఉత్సవాల కవరేజ్ కొరకు క్షేత్రానికి వెళ్ళగా అక్కడి ధర్మకర్త కుమారుడు ప్రొద్భలంతో ఇతర అర్చకులు దురుసుగా ప్రవర్తించడం తో పాటు అసభ్యకరంగా మాట్లాడి అవమానించినట్టు పిర్యాదు లో పేర్కొన్నారు. రథ భ్రమణం సందర్బంగా తాడును లాగుతున్న భక్తులపై పిడి గుద్దులు కురిపించారని, అన్నసత్రం లో సేవ పేరిట కొందరు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, భక్తులను తిట్టడం, అన్నం కొరకు వెలితే బిచ్చగాళ్ళకు వేసినట్టు వేయడం చేస్తున్నారని పిర్యాదు ఇవ్వడం జరిగింది. స్వామి కళ్యాణం రోజు విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు, మీడియా వారు అన్న ప్రసాదం కొరకు వెళితే దురుసుగా ప్రవరించినట్టు పిర్యాదు లో పేర్కొన్నారు. మీడియా, ప్రజలు, భక్తుల పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్న పంతుల్లపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు లో జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కోరారు.
