అండర్ 19 విభాగంలో జిల్లాస్థాయి క్రికెట్ పోటీలోకి సర్గం మహేష్.
అభినందించిన పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటాపతిరాజు.
{పయనించే సూర్యుడు} {నవంబర్ 21 మక్తల్ }
చిన్నప్పటినుండి క్రికెట్ పై ఉన్నటువంటి మక్కువతో చురుకుగా వ్యాయామం చేయడంతో పాటు క్రికెట్లో అత్యున్నత ప్రతిఫలం కనపరచడం చూసి గౌడ్ ట్రైనింగ్ తీసుకొని రాష్ట్రస్థాయిలో అండర్ 19 క్రికెట్ కు సెలెక్ట్ కావడం జరిగింది.. స్కాలర్ జూనియర్స్ కాలేజీలో చదువుకుంటూ ఆత్రుత ప్రతిభను కనపరిచిన మహేష్ ను పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు శాలువాతో సన్మానించడం జరిగింది.. వెంకటపతి రాజు మాట్లాడుతూ పేద అట్టడుగు వర్గాల విద్యార్థులు విద్యారంగం తో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావిణ్యతను సాధించి అత్యున్నత స్థాయికి ఎదగాలని అన్నారు.. మక్తల్ పట్టణానికి చెందిన మహేష్ దేశానికే ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తూ, కష్టపడి మరింత ముందుకు వెళ్లాలని కోరారు. ఈ క్రమంలో మహేష్ కు పుడమి ఫౌండేషన్ వెన్నుదన్నుగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.పుడమి ఫౌండేషన్ EC మెంబర్ ప్యాట పవన్ కళ్యాణ్. కడెచుర్ ఆంజనేయులు. శ్రీను. ఎల్లలింగ. తదితరులు పాల్గొన్నారు
