PS Telugu News
Epaper

కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ కరుణానిధి సూళ్లూరుపేట ఏ పి ఎం ప్రసన్న కుమారి చేతుల మీదుగా ఆర్థిక భరోసా

📅 21 Nov 2025 ⏱️ 5:57 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 21 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)

సూళ్లూరుపేట మండలం కొమ్మినేనిపల్లి గ్రామంలో వేలూరు యుగంధర్ గారు ప్రమాదవత్తు మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా ప్రధా న్‌మంత్రి సురక్ష బీమా యోజన’ లేదా , ప్రధాన్‌ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన్ రెండు యాక్టివ్ లో ఉన్నాయి. దీనికిగాను మేము రెండింటికి బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. ప్రధాన్‌మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంజేజేబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య వేలూరు లక్ష్మీ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ చీఫ్ మేనేజర్ కరుణానిధి మాట్లాడుతూ ప్రధాన్‌ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ శివ ప్రసాద్ , సూళ్లూరుపేట వెలుగు ఏపీఎం ప్రసన్న కుమారి, సీసీ సుధాకర్ సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం మరియు వివోఎ మల్లెమ్మ పాల్గొనడం జగిరింది.

Scroll to Top