PS Telugu News
Epaper

ఆదివారం నాడు మక్తల్ లో 2 K రన్ CTO – లక్ష్మణ్

📅 21 Nov 2025 ⏱️ 6:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{ పయనించే సూర్యుడు} {నవంబర్22 మక్తల్}

77 వ NCC ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ నాలుగో ఆదివారం అనగా ఈ నెల 23 న NCC డే ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు NCC – CTO లక్ష్మణ్ తెలిపారు.ఆదివారం నాడు ఉదయం 7 గంటలకు మక్తల్ కేంద్రంలో ZPHS బాలుర పాఠశాల లోని NCC యూనిట్ ఆధ్వర్యంలో 2 K రన్ (అంబేద్కర్ కూడలి నుండి దండు గేట్ వరకు) నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.ఔత్సాహికులైన బాలబాలికలు,యువత 2 K రన్ లో పాల్గొనాలని లక్ష్మణ్ కోరారు.2 K రన్ అనంతరం మక్తల్ కేంద్రంలోని మినీ స్టేడియం గ్రౌండ్ లో NCC పరేడ్ ఉంటుంది దానితో పాటు NCC విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని లక్ష్మణ్ తెలిపారు.
కావునా పురప్రముఖులు,విద్యావేత్తలు,మాజీ సైనికులు,సామాజిక సేవకులు,విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని 77 వ NCC ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని CTO లక్ష్మణ్ కోరారు.

Scroll to Top