గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్
పయనించే సూర్యుడు నవంబర్ 22 అన్నమయ్య జిల్లా టి సుండు పల్లె
ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్ మాట్లాడుతూ గ్రామము అభివృద్ధి జరగాలంటే ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న వారు సంఖ్యను పెంచి అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ తద్వారా కేంద్రం నుండి వస్తున్న నిధులను సరైన మార్గంలో ఖర్చుపెట్టాలి. కేంద్రం నుంచి వచ్చే నిధులలో 60% కూలీలకు 40% గ్రామ అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కావున గ్రామంలో ఉండే నవ దంపతులు నూతన రేషన్ కార్డ్ వచ్చిన వారు ఇంతవరకు జాబ్ కార్డ్ లేని వారు ప్రతి ఒక్కరు కూడా జాబ్ కార్డ్ చేయించుకొని ఇల్లు లేని వారు ఈనెల 30వ తారీకు లోపల ఆన్లైన్లో అప్లై చేయవలసిందిగా సూచించారు గ్రామ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఎన్ ఆర్ జి ఎస్ పథకము కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి కూలీకు 100 రోజుల పని దినములు కల్పిస్తున్నారు అంతేకాకుండా ఈ పథకం ద్వారా మామిడి మొక్కలు జామ ఉసిరి బాదం ఇలా అనేక రకాల మొక్కలను రైతులకు అందజేస్తున్నారు మొక్కలు నాటిన పెమట మొక్కలు సంరక్షణకై ప్రతి నెల ఒక చెట్టుకు నాలుగు నుండి ఆరు రూపాయలు ప్రభుత్వం నుండి అందుతుంది ఇలా అనేక కార్యక్రమాలు సిసి రోడ్లు అయితేనేమి తారు రోడ్డు అయితే లేని ట్యాగ్లులు ఇలా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని బిజెపి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న టెక్నికల్ అసిస్టెంట్ గోవిందు ఫీల్డ్ అసిస్టెంట్ సిద్దేశ్వర చిన్న గొల్లపల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు