PS Telugu News
Epaper

స్పష్టమైన ఓటర్ల జాబిత రూపకల్పనకు సహకరించండి: జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్

📅 23 Nov 2025 ⏱️ 1:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ పేర్కొన్నారు. శనివారం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో ఓటర్ల జాబితా రూపకల్పన పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన పార్టీ ప్రతినిధి రవి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, బిఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధి సాయిరాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, సిపిఐ పార్టీ ప్రతినిధి పి.నరసింహులు, టిడిపి పార్టీ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ మాట్లాడుతూ స్పష్టమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీ ప్రశ్నలు సహకరించాలన్నారు. అదేవిధంగా ఫార్మ్స్ 6, 7, 8 లను పెండింగ్ ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు డిఆర్ఓ తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు కూడా బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని వారు స్థానిక ఓటరు అయి ఉండాలని, అలా లేని పక్షంలో నియోజకవర్గ అభ్యర్థులను బూతు లెవల్ ఏజెంట్లుగా నియమించుకోవాలని రాజకీయ పార్టీ ప్రతినిధులకు డిఆర్ఓ తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కు సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదించడం జరిగిందన్నారు.రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపల్, పంచాయితీ ఎన్నికలలో ఈవీఎం మిషిన్లకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ఏర్పాటు చేసేలా చూడాలని రాజకీయ పార్టీ ప్రతినిధులు డిఆర్ఓకు నివేదించారు.

Scroll to Top