రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు మృతి
పయనించే సూర్యుడు న్యూస్ :ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సహా స్థానిక అధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి పనిచేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆగని బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో మరో రెండు బస్సులు ఢీకొన్నాయి. తమిళనాడులోని టెన్‌కాశీలో నవంబర్ 24 సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపట్టి సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందినట్టుగా తెలిసింది. మరో 42 మంది గాయపడ్డాని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుత అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఉదయం 11 గంటల ప్రాంతంలో కడయనల్లూరు సమీపంలోని దురైసామిపురం వద్దకు KSR అనే ప్రైవేట్ బస్సు వస్తోంది. ఆ సమయంలో, MR గోపాలన్ అనే బస్సు కోవిల్పట్టి నుండి టెన్‌కాశీ వైపు వస్తోంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ కమల్ కిషోర్, ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి పనిచేస్తున్నారు. గాయపడిన వారిని టెన్‌కాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.