PS Telugu News
Epaper

మాజీ మంత్రితో ఫోటో వివాదం: బ్రహ్మానందం స్పష్టీకరణ

📅 24 Nov 2025 ⏱️ 3:29 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :టాలీవుడ్‌కి చెందిన సీనియ‌ర్ న‌టుడు, స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాడు. అందుకు కార‌ణం ఓ ఫొటో. వివ‌రాల్లోకెళ్తే.. మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌రరావు బ్ర‌హ్మానందంతో ఫొటో దిగాల‌నుకుని ఆయ‌న్ని అడిగాడు. ఇప్పుడు కాదంటూ ఈయ‌న వెళ్లిపోయాడు. ఇప్పుడీ వీడియోనే సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. మోహ‌న్ బాబు సినీ ప్ర‌స్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా భారీ వేడుక జ‌రిగింది. ఇందులో ప్ర‌ముఖ సినీ, రాజ‌య నాయ‌కులు పాల్గొన్నారు ఈవెంట్‌లో మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు, న‌టుడు బ్ర‌హ్మానందం ఎదురు ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో త‌నతో ఫొటో దిగాల‌నుందంటూ ఎర్ర‌బెల్లి చేసిన రిక్వెస్ట్‌ను బ్ర‌హ్మానందం తోసిపుచ్చారు. అది వైర‌ల్‌గా మారింది.దీనిపై ఎట్ట‌కేల‌కు న‌టుడు బ్ర‌హ్మానంది స్పందించారు. ‘ఉదయం ఓ వీడియో చూసి న‌వ్వుకున్నాను. మోహ‌న్‌బాబుగారి ఫంక్ష‌న్‌లో నేను హ‌డావుడిగా వెళ్తుంటే ద‌య‌న్న ఎంట‌ర‌య్యాడు. ఇద్ద‌రం కాసేపు స‌ర‌దాగా మాట్లాడుకున్నాం. ఆయ‌న ఓ ఫొటో తీసుకుందామ‌ని అడిగారు. నేను వ‌ద్ద‌ని చెప్పి లోప‌ల‌కి వెళ్లాను. ద‌య‌న్న నాకు మంచి స్నేహితుడు. ఇద్ద‌కికీ 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్‌లా ఉంటాం.ఆయ‌న ఫొటో తీసుకుందామ‌ని నాతో అన్న‌ప్పుడు ఉండండి అంటూ చ‌నువుతో చెప్పి ముందుకు వెళ్లిపోయాను. అయితే దాన్ని చిత్రీక‌రించిన కొంద‌రు నేను కావాల‌నే తోశానంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేశారు. త‌ర్వాత మేం పొద్దున‌ వీడియో చూసి న‌వ్వుకున్నాం. అన్నా త‌ప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఆయ‌న నాతో మాట్లాడారు. ఇందులో ఎలాంటి అపార్థాలు చేసుకోవ‌ద్ద‌ని కోరుతున్నాను’ అని అన్నారు బ్రహ్మానందం.

Scroll to Top