మోదీ ప్రభుత్వ కీలక నిర్ణయం: పార్లమెంట్లో త్వరలో కొత్త బిల్లు
పయనించే సూర్యుడు న్యూస్ :మోదీ ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో కీలక బిల్లు ప్రవేశపెట్టేలా అడుగులు వేస్తోంది. బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేలా పరిమితిని పెంచనుంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు రానుందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రభుత్వ బీమా కంపెనీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురానుంది.కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోన్నట్లు తెలుస్తోంది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోన్న విషయం తెలసిందే. అందులో భాగంగా మరో రంగాన్ని ప్రైవేటీకరించేందుకు సిద్దమవుతోంది. అదే ఇన్స్యూరెన్స్ రంగం. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు బీమా సంస్థలు నడుస్తున్నాయి. అవే ఓరియెంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్. ఈ మూడు కంపెనీల అభివృద్దికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అందుకుగాను మూడు కంపెనీలకు విలీనం చేసి ఒకే సంస్ధగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. మూడు కంపెనీలు వేర్వేరుగా ఉండటం వల్ల అర్ధికంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ మూడు కంపెనీలు ఆర్ధిక ఇబ్బందుల్లో కూడా ఉన్నాయి. ఒకే కంపెనీగా చేయడం వల్ల నష్టాల నుంచి బయటపడతాయని కేంద్రం భావిస్తోంది.గతంలో 2018-19లో అప్పటి ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ మూడు కంపెనీలను విలీనం చేసి ఒకే కంపెనీగా ఏర్పటు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత 2020 జులైలో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ మూడు సంస్థలను గట్టెక్కించేందుకు రూ.12,540 కోట్ల మూలధనాన్ని కూడా అందించింది. ఇప్పుడిప్పుడు ఆ మూడు సంస్థలు ఆర్ధిక గండం నుంచి బయటపడుతుండటంతో.. పాత నిర్ణయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ మూడు కంపెనీలను ఒక దాంట్లో విలీనం చేయడంతో పాటు ఒక బీమా కంపెనీని ప్రవేటీకరించాలని చూస్తోంది. ప్రైవేటీకరించేందుకు జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ సవరణ చట్టం, 2021ని కూడా గతంలో పార్లమెంట్ ఆమోదించింది.బీమా కంపెనీలకు ఉన్న డిమాండ్ కారణంగా వీటిల్లో విదేశీ పెట్టుబడులను 74 శాతం నుంచి 100 శాతం పెంచేలా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బిల్లును తీసుకురానుంది. ఇంతకంటే మందు ప్రభుత్వ రంగ బీమా సంస్ధలను ఒకే గొడుగు కిందకు తీసుకురానుందని తెలుస్తోంది. 2019-20 నుంచి 2021-22 మధ్య ఈ మూడు బీమా సంస్థల్లో కేంద్రం రూ.17,540 కోటల్ పెట్టుబడి పెట్టింది. వీటిల్లో కనీసం 51 శాతం వాటాను కలిగి ఉండాలనే నిబంధనను నిబంధనను కూడా చట్టం ద్వారా ఎత్తివేశారు. దీంతో విదేశీ పెట్టుబడలకు మార్గం సుగమమైంది.