మరమ్మతుల కోసం 33 కేవీ లైన్ నిలిపివేత – విద్యుత్ సరఫరాలో అంతరాయం
పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
రేపు మంగళవారం 33 కేవీ లైన్ మైంటెనెన్స్ పనుల కారణంగా 33/11 కేవీ నేరాల్ల, కట్కుర్ మరియు అంకిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు. మైంటెనెన్స్ పనులను సురక్షితంగా పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ విజ్ఞప్తి చేసింది.