సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా?
పయనించే సూర్యుడు నవంబర్ 7 ( మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట గ్రామపం చాయతీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులు కూడా మున్సిపాలిటీగా మారి జనాభా 40 లక్షల పైచిలుకు అని చెబుతున్నా సూళ్లూరుపేట శివారు ప్రాంతాలలోని మిగతా వీధుల్లో కానీ పన్నులను మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్న మునిసిపాలిటీ వారు బజారులో లక్షలకు లక్షలు కట్టవలసిన వారు ఉన్నా వారి జోలికి పోనే పోరు అలాంటప్పుడు ఏ పని చెప్పినా ఫండ్స్ లేవు అనే ఒకే సమాధానంతో తప్పించుకుంటున్నారు ఈ వాక్యాలు బజారులోని వారే చెబుతున్నారు మాకు వద్దు అంటే ఇరువైపులా కాలువ వేశారు ఈమధ్య 24 గంటలు నీరు సరఫరా చేస్తాము కేంద్ర ప్రభుత్వంతో కలిసి అని పైపులైన్లు వేశారు ఆ పనులు సగంలోనే ఆపేశారు ప్రస్తుతం పని చేస్తున్న కొళాయిల పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది కారణం ఎక్కడపడితే అక్కడ వారికి కావలసిన దగ్గర అంతా రోడ్డును విస్తీర్ణం చేసేటప్పుడు తోవడంలో పైప్ లైన్ డామేజ్ అయినా పట్టించుకోకుండా మంచినీటి సరఫరా చేస్తున్నాము అని ప్రకటించుకున్నారు అత్యధిక ఫిర్యాదులు రావడంతో అక్కడక్కడ కొంత ప్యాకేజ్ వర్క్ చేసినారు పూర్తిగా చేయనందువల్ల మురికి నీరు కొళాయిల్లో ప్రవహించడం ఎక్కువైపోయింది వీటి మీద దృష్టి సారించక సూళ్లూరుపేట పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగానూ ముఖ్యమైన ప్రదేశాలలో రోడ్డుకు ఇరువైపులా కాలువలు లేకుండా రాకెట్ టౌన్ గా ఉన్న సూళ్లూరుపేటకు గ్రౌండ్ లెవెల్ లో పోయి చూస్తే పట్టణ ప్రాంతంలో అన్ని దగ్గర గుంతల మయమే వీటి మీద స్పందించి కాస్తంత జీ.ఎన్.టి రోడ్ లో నాలుగు గుంటలు పూడ్చేసి అయిపోయింది అని చేతులు దులుపుకు న్నారు ఇప్పుడు మంచినీటి కొళాయిల సంగతి చెబితే ఆ విషయాన్ని పెడచెవి ను పెడుతున్నారు ఎన్నిసార్లు స్పందిస్తారని చూసినా స్పందిం చడం లేదంటే ఇది మున్సిపాలి టీగా అభివృద్ధి చెందక దయనీ య పరిస్థితుల్లో ఉందన్న సంగ తి అందరికీ తెలిసిపోయింది ఇక ప్రజలందరూ కలిసికట్టుగా తల పది రూపాయలు వేసుకొని పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మున్సి పా లిటీ ఎన్నికలు ప్రస్తుతం లేవు మునుపు ఎన్నికైన పార్టీ వారికి వీరు అధికారాన్ని ఇవ్వడం లేదు అని ఇంతకుముందు ఎన్నికైన సభ్యులే ఆరోపిస్తున్నారు 13వ వార్డు కౌన్సిలర్ చనిపోతే ఇంత వరకు దానిమీద ఎన్నికలు కూడాజరుపలేదు అన్నది ఒక ఆరోపణ ఇలాంటి పరిస్థితుల్లో అసలు మున్సిపాలిటీ స్పంది స్తుందా లేదా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు సూళ్లూరు పేట శాసనసభ్యులు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ గారు స్పందించి ప్రభుత్వా నికి ప్రస్తు తం పట్టణం ఎదుర్కొంటున్న మంచినీటి కుళాయిల సమస్య మరియు రోడ్ల సమస్యను వెనువంటేనే పరిష్కరించడానికి ఆదేశించాలని లేని పక్షాన ప్రజ లు వామపక్షాలతో, ప్రతిపక్షా లతో కలిసి నిరసన తెలియజేసే పరిస్థితి వస్తుందని కూడా పట్ట ణ ప్రజలు హెచ్చరిస్తు న్నారు..?
