ఈనెల 9 నుండి, రాష్ట్ర వ్యాప్త ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ సత్యాగ్రహ యాత్రవి ఆర్ పురం, కొటార్గోమ్ము నుండి ప్రారంభం.ఈ నెల 16 న చింతూరు లో జరిగే ఆదివాసీ యువగళం బహిరంగ సభ జయప్రదం చేద్దాం.
@ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జె ఏ సి
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ, డివిజన్ చైర్మన్ నరేష్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమావేశంలో కేంద్ర కమిటీ సభ్యులు మరియు నెహ్రూ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడంలో భాగంగా, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని సాధించుకోవడం కోసం మరియు రంపచోడవరం కేంద్రంగా, రంపచోడవరం పోలవరం నియోజకవర్గాలను కలుపుతూ కారం తమన్న దొర జిల్లా ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్రకు సిద్దమైంది. నెల రోజులు పాటు సాగే ఈ యాత్ర ఈనెల తొమ్మిదో తారీఖు ఆదివారం నుండి, చింతూరు డివిజన్ విఆర్ పురం మండలం కొటార్గొమ్ము గ్రామం నుండి ప్రారంభించనున్నట్టు తెలియజేశారు. చింతూరు డివిజన్లో వారం రోజులు పార్టీ సాగే యాత్రను ప్రదేశ్ ఆదివాసి జేఏసీ భాగస్వామ్య సంఘాలు, గ్రామ గ్రామాన ఆదివాసీలందరు ఐక్యంగా జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అలానే ఈ నెల 16 న ఆదివారం చింతూరు లో జరిగే ఆదివాసీ యువగళం బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో డివిజన్ వైస్ చైర్మన్ శీలం.తమ్మయ్య మండల చైర్మన్ పి.రామకృష్ణ,డివిజన్ సభ్యులు మడివి.రాజు, రమేష్,తదితరులు పాల్గొన్నారు
