కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి మార్పులుండొచ్చు కానీ 5వ షెడ్యూల్డ్ లో ఎల్టీఆర్ కోర్టు, చట్టాలే మాత్రమే వర్తిస్తాయి
ఆదివాసీపార్టీ ఆదివాసి జెఏసి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7
కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి మార్పులుండొచ్చు కానీ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ కోర్టు, ఎల్టీఆర్ చట్టాలే మాత్రమే వర్తిస్తాయని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు,ఆంద్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి జిల్లా చైర్మన్ రామారావుదొర అన్నారు. వివరాల్లోకి వెళ్తే భారత రాజ్యాంగం లో 5 వ షెడ్యూల్డ్ ప్రాంతం,ఆర్టికల్ 244 (1) భూముల హక్కుల నిర్ధారణను తెలుపుతూ, అల్లూరి సీతా రామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ (భూబదాలయింపు నిషేధ చట్టం)1917 , 1/1959 , 1/1970, 1/1978 చట్టాలప్రకారం మాత్రమే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(గిరిజన సంక్షేమం)ఎస్ ఆర్ నెంబర్ ఇచ్చి కోర్టు నిర్వహించి గిరిజనేతరులు అన్యాక్రాంతం చేసిన భూములపై కోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని,జిఓ ఎంఎస్ నెం57,సాధారణ పరిపాలన(ప్రత్యేకం-ఏ)శాఖ,ఆర్.సి.నెం24/టిఆర్ఐ/ఎస్పిఎంయూ-ఎల్ టిఆర్ఎస్ మరియు పెసా/2017,గిరిజన సంక్షేమ శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేదీ 13/10/2017,పెసా చట్టం 1998,రూల్స్-2011,5వ షెడ్యూల్డ్,ఆర్టికల్ 244(1),సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం1997,గౌరవ సుప్రీం కోర్టు ఆర్డర్ లను పట్టించుకోకుండా ఆర్సీ నెం:80/2023-ఎస్ఆర్, ప్రొసిడింగ్ ఆఫ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(గిరిజన సంక్షేమం,పాడేరు)తేది 20/06/2024 ఆడాకుల గ్రామం, కొయ్యూరు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా నందు కొంతమంది గిరిజనేతరులను వెబ్ ల్యాండ్ వారి పేర్లు నమోదు చేయాలని చెప్పారని,,మైదాన ప్రాంతం నుండి వలస వచ్చిన గిరిజనేతరులు ఈ 5 వ షెడ్యూల్డ్ ప్రాంతం లోని భూమిని చట్ట విరుద్ధంగా అన్యాక్రాంతం చేసి అనుభవిస్తున్నారని,
భారత రాజ్యాంగం ,పార్ట్ 10 ,ఆర్టికల్ 244 (1),5వ షెడ్యూల్డ్ పేరా 5 (2) (ఎ, బి) మరియు ఆర్టికల్ 19 (5) సంభందిత రాజ్యాంగ నిభందనలు , షెడ్యూల్డ్ ప్రాంతం అందలి భూ బదిలీ ,రక్షణల గురించి తెలియజేస్తున్నాయి.5వ షెడ్యూల్డ్ ప్రాంతం లోని గిరిజనేతరులు కలిగి ఉన్న భూముల చట్ట భద్రత నిర్దారించుటకు విచారణ కోర్టుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గిరిజన సంక్షేమం), పాడేరు ని ఈ షెడ్యూల్డ్ ప్రాంతానికి నియమించి ఉన్నది. సదరు అధికారి ఏపీ ఏజెన్సీ ఏరియా , ల్యాండ్ ట్రాన్స్ఫర్ మరియు రెగ్యులేషన్ యాక్ట్ 1917 , 1/1959 , 1/1970, 1/1978 ప్రకారం ఏపీ ఎల్టీఆర్ రూల్స్ 1969 ప్రకారం సంభందిత భూమిని కలిగిన గిరిజనేతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసి వాటికి ఎస్ ఆర్ నెంబర్లు ఇచ్చి, కేసు నమోదు చేసి ,తగిన ఆధారాలు పరిశీలించి మరియు సూచికలో తెలిపిన జిఓ ఎంఎస్ నెం 57 , ఎల్టీఆర్ గైడ్ లైన్స్, ఆర్సీ నెం 24 మరియు సమత వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం జడ్జిమెంట్ 1997 సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిగణన లోనికి తీసుకుని కోర్టు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉన్నది. కానీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గిరిజన సంక్షేమం) ,పాడేరు వారు పై సూచికలలో ఉన్న చట్టాలను, నిభందనలను పాటించకుండా ఎటువంటి ఎస్ ఆర్ నెంబర్లు ఇవ్వకుండా కోర్టు నిర్వహించకుండానే ఉత్తర్వులు ఇచ్చారు,కనుక మమ్మల్ని కూడా పార్టీగా తీసుకుని ఎస్ ఆర్ నెంబర్లు ఇచ్చిస్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (గిరిజన సంక్షేమం) ,పాడేరు వారు సదరు భూములపై కోర్టు నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చుటకు అర్జీ పెట్టుచున్నామని, అప్పటి వరకు సదరు భూములపై ఎటువంటి హక్కు పత్రాలు మంజూరి చేయవద్దని , భూ హక్కులు నిర్దారించే చట్టాలు ఏవి ఉన్నప్పటికి 5 వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టాలు , మిగిలిన చట్టాలను ఓవర్ రైడ్ చేస్తాయని జిల్లా కలెక్టర్ కి తెలియచేసారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి కొయ్యూరు మండల కార్యదర్శి బూరుగు వెంకట్రావు,గిరిజన విద్యార్థి సంఘం నాయకులు కిషోర్,అనిల్,కామేశ్వర్రావు,బుజ్జి ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.