PS Telugu News
Epaper

బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం నేటికి 150 సంవత్సరాలు పూర్తి

📅 07 Nov 2025 ⏱️ 6:00 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7

అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు డివిజన్, చింతూరు మండలం,చట్టి గ్రామంలో ఎం.పి.యు.పి స్కూల్ ఆవరణలో మరియు మూడు రాష్ట్రాల కూడలిలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం, 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా ముందుగా స్కూలుయాజమాన్యం చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మాట్లాడుతూ, వందేమాతరం గేయం 1870 దశకంలో బంకిం చంద్ర చటర్జీ రచించినదీన్ని ఆయన 1882లో ప్రచురించిన ఆనందమఠం అనే నవలలో చేర్చారు.అసలు బంకిం చంద్ర చటర్జీ రచించిన సంస్కృత గీతం వందేమాతరం. అహింసాయుత భారత స్వతంత్ర ఉద్యమంలోరణన్నినాదంగాఉపయోగపడింది.స్వతంత్రం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించడంజరిగిందంటూవక్తలుకొనియాడారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి.ముత్తయ్య సిబ్బంది కే.తులసి,కే.రమేష్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ పి.అర్జున్ ఐ.సి.డి. ఎస్.సి.డి.పి.ఓ.జయలక్ష్మి గ్రామ ఉపసర్పంచ్ టి.రాముడు పెసా కమిటీ కార్యదర్శి P. రామకృష్ణ మరియు హెల్త్సిబ్బంది,ఐసిడిఎస్ సిబ్బంది,డ్వాక్రాయానిమేటర్లు,ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ మరియు సచివాలయం సిబ్బంది పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top