స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వందేమాతర గీతం.ఎ ఎస్పి హేమంత్ ఐపీఎస్ చింతూరు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది వందేమాతర గీతమేనని, ఈ గీతాన్ని బకీంచంద్ర చటర్జీ రచించిన ఆనందమఠ నవల నుండి తీసుకోబడిందని చింతూరు ఎ ఎస్పీ హేమంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏ ఎస్ పి హేమంత్ గారు విద్యార్థులతో ముచ్చటించారు. వందేమాతర గీతానికి 150 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ ప్రజలకు జాతీయ గీతం నవంబర్ 7 తారీకు కు 150 ఏళ్లు నిండిన సందర్భంగా 2026 నవంబర్ 7వ తేదిన ఒక ఉత్సవం లాగా వందేమాతర గీతాన్ని నిర్వహించాలని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు దేశ పౌరులందరూ, అధికారులు, పోలీసులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు ప్రతి ఒక్కరు ఆలపించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో చింతూరులోని పోలీస్ స్టేషన్ ఆవరణంలో శ్రీ భాస్కర విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులచే వందేమాతర గీతాన్ని ఆలపింప జేశారు. ఈ సందర్భంగా సిఐ గోపాలకృష్ణ, ఎస్సై రమేష్, భాస్కరా విద్యానికేతన్ కరస్పాండెంట్ వేణు గోపాల్, ప్రిన్సిపాల్ రాంబాబు విద్యార్థులకు వందేమాతర గీతం ప్రాశస్యస్తాన్ని వివరించారు. స్వాతంత్ర ఉద్యమం లో ప్రజలను సంఘటితం చేయడానికి, చైతన్య పరచడానికి వందేమాతర గీతం ప్రధాన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, భాస్కరావిద్యా నికేతన్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
