PS Telugu News
Epaper

పెళ్లి వేడుకకు వెళ్తున్న కారు బోల్తా – ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు

📅 08 Nov 2025 ⏱️ 11:14 AM 📝 ఆంధ్రప్రదేశ్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపై కారు వేగంగా దూసుకెళ్లింది. దీంతో రెండు బైకులు, ఒక రిక్షా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నవరం నుంచి జగ్గంపేటకు వెళ్తున్న పెళ్లికారు ఫ్రంట్ టైర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘటనాస్థలానికి చేరుకు ప్రమాదంపై ఆరాతీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించారు అధికారులను కోరారు.

Scroll to Top