PS Telugu News
Epaper

వైన్స్ వ్యాపారులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం – ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు

📅 08 Nov 2025 ⏱️ 11:43 AM 📝 తెలంగాణ, వైరల్ న్యూస్
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :‘‘నా రూటే సపరేటు.. నా లెక్క వేరే.. నా ఇలాఖాలో నేనే రాజు.. నేనే మంత్రి..’’ అంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే పనుల విషయంలో అధికారులకు తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా వ్యాపారులకు షరతులు వర్తిస్తాయని అంటున్నారు. మునుగోడు నియోజక వర్గంలో నూతన వైన్ షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులకు నయా రూల్స్ పెట్టారట. నా మాటే శాసనమంటూ.. మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా జారీ చేశారట.‘‘మునుగోడు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు చెల్లవు.. నా సొంత పాలసీలే మునుగోడులో అమలవుతాయ’’ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారట. రాష్ట్రవ్యాప్త మద్యం పాలసీ మునుగోడులో చెల్లదంటూ లిక్కర్ వ్యాపారులకు షరతులు విధిస్తున్నారట. తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని మద్యం వ్యాపారులకు ఆయన ఫత్వా జారీ చేశారట. నియోజకవర్గంలో మద్యం షాపులను దక్కించుకున్న లిక్కర్ వ్యాపారులు రాజగోపాల్ రెడ్డిని కలిసారు. మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మూడు కండిషన్లు పెట్టారట. మొదటది వైన్స్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవడానికి వీల్లేదు. మధ్యాహ్నం 1గంటకు షాపులు తెరవాలి. రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయాలి. రెండవది పర్మిట్ రూ‌మ్‌లు పగటిపూట మూసేయాల్సిందే.. సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేసి వైన్స్ షాపు తోపాటే క్లోజ్ చేయాలి. మూడవది.. బెల్టు షాపులకు లిక్కర్ అమ్మేందుకు వీల్లేదు. తన ఆదేశాల మేరకే మునుగోడులో లిక్కర్ షాపులు నడవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారట. నియోజకవర్గంలోని 159 గ్రామాల్లో ప్రత్యేకంగా టీమ్ లను ఏర్పాటు చేస్తానని, ఈ టీమ్స్ బెల్టుషాపులపైన నిఘా పెడ్తాయని, లిక్కర్ వ్యాపారులకు ఎమ్మెల్యే చెప్పారట. తన షరతులు, తాను గీసిన లైన్ దాటితే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆయన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం అమ్మకాలపై ఉద్యమమే చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. గత 20 నెలల్లో బెల్టుషాపులకు లిక్కర్ వెళ్లకుండా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మునుగోడును రోల్ మోడల్ గా నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. రెండేళ్లలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా వెనకబడ్డ మునుగోడులో మద్యపాన నిషేధం పక్కాగా అమలు చేయోచ్చనీ రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. ఇందుకు అందరూ సహకరించాలని తనదైన శైలిలో లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారట. మొత్తానికి మద్యం వ్యాపారులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జారీ చేసిన మద్యం ఫత్వా పై చర్చ జరుగుతోంది.

హెచ్చరించారట.

Scroll to Top