రష్మిక షాకింగ్ రివీలేషన్ – “విజయ్ దేవరకొండతో డేట్ చేస్తాను!
పయనించే సూర్యుడు న్యూస్ :నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. థామా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల రష్మిక పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. కొన్ని రోజుల క్రితం ఆమె విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకుందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకోబోతున్నారట. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతున్నాయి. తాజాగా హానెస్ట్ టౌన్ హాల్ తో క్యాంపస్ తో మాట్లాడిన రష్మిక తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు నటించిన నటులలో ఎవరినీ పెళ్లి చేసుకుంటావని అడగ్గా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది.రష్మిక మాట్లాడుతూ.. “నిజాయితీగా చెప్పాలంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకోవాలి. నా ప్రతి విషయాన్ని తన సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి. అతను కొన్ని పరిస్థితులను ఎలా గ్రహిస్తాడు ? ఆ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తిని కోరుకుంటున్నాను. నిజంగా మంచివాడు. నాతో లేదా నా కోసం యుద్ధం చేయగల వ్యక్తి. రేపు నాపై యుద్ధం జరిగితే నా కోసం పోరాడే వ్యక్తి కావాలి ” అంటూ చెప్పుకొచ్చింది.ఆ తర్వాత తాను ఇప్పటివరకు పనిచేసిన నటులలో ఎవరిని చంపుతావు..? ఎవరితో డేట్ చేస్తావు.. ? ఎవరిని పెళ్లి చేసుకుంటావు ? అని అడగ్గా.. నరుటో (యానిమేషన్ పాత్ర)తో డేటింగ్ చేస్తానని.. అలాగే విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. విజయ్ దేవరకొండతో పెళ్లి రూమర్స్ వస్తున్న వేళ.. రష్మిక చేసిన కామెంట్స్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.