బిహార్ ఎన్నికల్లో తెలుగు నేత ఎంట్రీ – ఎన్డీఏ ప్రచార బాటలో నారా లోకేశ్
పయనించే సూర్యుడు న్యూస్ :బిహార్ ఎన్నికల ప్రచారంలో ఏపీ మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు. ఎన్డీఏ తరుపున రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. కళ్యాణదుర్గం పర్యటన ముగించుకుని ఇవాళ మధ్యాహ్నం ఆయన పట్నా వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం బిహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ సమావేశమవుతారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనాలను వారికి వివరిస్తారాయన. ప్రచారం కోసం ఇతర రాష్ట్రల్లో ఉన్న ప్రముఖ నేతలను తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు బిహార్ పార్టీల నేతలు. స్టార్ క్యాంపెయినర్లుగా, భాషాపరమైన ఓటర్లను ఆకర్షించే వారిగా వారిని రంగంలోకి దింపుతున్నాయి. ఎన్డీఏ పక్షాలు అయిన జేడీయూ, బీజేపీలకు మద్ధతుగా టీడీపీ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేశ్ బిహార్ లోని పాట్నాకు ఇవాళ వెళ్లనున్నారు. ప్రచారం ముగిసన తర్వాత నారా లోకేశ్ సాయంత్రం 7.30కు బిహార్ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. అలాగే నవంబర్ 9 ఉదయం 10 గంటలకు పాట్నాలో ఎన్డీఏకు మద్ధతుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.