తెలంగాణ

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులు సిద్ధం

స్థానిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థులు సిద్ధం

పయనించే సూర్యుడు అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రామచంద్రపురం పట్టణ అధ్యక్షులు దునే శ్రీనివాసు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ సలాది శేఖర్, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి శ్రీను, మాధవభట్ల కృష్ణమూర్తి, యండ్ర బుల్లబ్బులు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించే స్థానాల్లో సమర్థులైన, ప్రజలకు అందుబాటులో ఉండే నిబద్ధత కలిగిన కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేసి బరిలో నిలుపుతామన్నారు. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూ భాగస్వామ్య పార్టీలతో సమన్వయంతో ముందుకు సాగుతూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేస్తారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని స్థానిక స్థాయిలోనూ బలోపేతం చేస్తామన్నారు. కూటమి ఐక్యతే బలం, కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందన్నారు.ఇట్లు, భారతీయ జనతా పార్టీ, రామచంద్రపురం పట్టణ కార్యవర్గం

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS