జమ్మూ కాశ్మీర్లో సైనికుల కీలక ఆపరేషన్: ఉగ్రవాదుల హత్యతో విపత్తు నివారణ
పయనించే సూర్యుడు న్యూస్ :జమ్మూకాశ్మీర్‌లో భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పింపుల్ కొనసాగుతోంది. కుప్వారాలోని కేరన్ సెక్టార్లో చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. దేశంలోకి ఉగ్రవాదులు చొరబాటుకు యత్నిస్తున్నారని, పక్కా ఇంటలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు.. నిన్న (నవంబర్ 7)‘ ఆపరేషన్ పింపుల్’ను ప్రారంభించింది. మొదటగా భారత సైన్యం అనుమాస్పద కదలికలను గుర్తించాయి. అనంతరం ‘ఆపరేషన్ పింపుల్’ను దళాలు ప్రారంభించాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. సైన్యం కూడా ఎదురుకాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోక ఉగ్రవాది అక్కడ నక్కి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన దగ్గర నుంచి భద్రతా దళాలు నిఘా పెంచాయి. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను కూడా సైన్యం ముట్టబెట్టింది. అయితే పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను సైతం దళాలు హతమార్చాయి. ప్రస్తుతం దేశంలోకి ఉగ్రవాదులు చొరబడకుండా సైన్యం కట్టడి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మే 7న పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.