PS Telugu News
Epaper

చర్లపల్లి షాక్! జవాన్‌పై ఐఎస్ఐ ఖైదీ దాడి!

📅 06 Nov 2025 ⏱️ 12:35 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :హైదరాబాద్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో విధుల్లో ఉన్న ఓ జవాన్‌పై పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఖైదీ దాడికి పాల్పడినట్లు సమచారం. ఈ సంఘటన నిన్న (బుధవారం) చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నిన్న చర్లపల్లి సెంట్రల్ జైల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ రాజేష్‌,  జైల్లోని యూనిట్ ఆస్పత్రి వద్ద తనిఖీల్లో ఉండగా.. అప్పుడే చికిత్స నిమిత్తం మాజ్ అనే ఖైదీ అక్కడికి వచ్చాడు. అయితే ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌తో ఖైదీ మాజ్ తనను నిమ్స్ ఆస్పత్రికి కానీ, ఉస్మానియా ఆస్పత్రికి కానీ రిఫర్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. అయితే ఆ మహిళా డాక్టర్ మాజ్‌కు చిన్న ఆరోగ్య సమస్యనని..  అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్ చేస్తానని చెప్పారు. దీంతో మాజ్‌ ఆగ్రహంతో ఊగిపోతూ.. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి తిట్టు పురాణం మొదలుపెట్టాడు. అదే సమయంలో రౌండ్స్‌లో ఉన్న జవాన్‌ రాజేష్‌ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని ఆయనపైనే దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది, ఇతర ఖైదీలు మాజ్‌ను ఆపారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్, మరో జవాన్ ఎదురుదాడి చేసి రాజేష్‌ను కాపాడారు. ఐఎస్ఐ సంబంధిత కేసులో మాజ్ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది.

Scroll to Top