తెలంగాణ

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం ఇవ్వాలి ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు ఆత్మారాం

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం ఇవ్వాలి ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు ఆత్మారాం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బలం చేకూరుతుంది: సేవాదళ్ నాయకులుబైంసా:బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి త్వరలో ఖాళీ కానున్న నేపథ్యంలో, ఆ పదవికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మంచిర్యాల జిల్లా పరిశీలకులు ఎం.ఏ. లతీఫ్‌ను నియమించాలని కోరుతూ ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ కాంగ్రెస్ సెల్ ఆధ్వర్యంలో బైంసాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు ఆత్మారాం, బైంసా మండల సేవాదళ్ అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, వచ్చే నెల 23వ తేదీన బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఖాళీ కానుందని తెలిపారు. ఈ పదవికి ఎం.ఏ. లతీఫ్ గారు అర్హులని పేర్కొన్నారు.ఎం.ఏ. లతీఫ్ అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారని, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని వారు తెలిపారు. 2023లో పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటికీ, ఎం.ఏ. లతీఫ్ మాత్రం పార్టీని వీడకుండా కాంగ్రెస్ జెండాను కొనసాగిస్తూ, “ప్రజలే నా బలం” అనే నినాదంతో ప్రజల్లో పనిచేస్తున్నారని అన్నారు.బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎం.ఏ. లతీఫ్ గారికి ఇస్తే ముధోల్ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నాయకుల్లో సంతోషం నెలకొంటుందని వారు పేర్కొన్నారు.పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారికే కాకుండా, పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా సేవలందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్‌ను వారు కోరారు. ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించడం ద్వారా పార్టీ కోసం ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.
అలాగే, ఎం.ఏ. లతీఫ్‌ను బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తామని సేవాదళ్ నాయకులు హెచ్చరించారు.రాబోయే ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహానికి ఎం.ఏ. లతీఫ్‌కు అవకాశం కల్పించడం దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS