PS Telugu News
Epaper

మైనారిటీ సంక్షేమ దినోత్సవం- జాతీయ విద్యా దినోత్సవం కు మంత్రి ఎన్ఎండి ఫరూక్ , జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కు ఆహ్వానం

📅 08 Nov 2025 ⏱️ 2:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

నంద్యాల జిల్లా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ‘మైనారిటీ సంక్షేమ దినోత్సవం – 2025’ మరియు ‘జాతీయ విద్యా దినోత్సవం’ వేడుకలను 11 వ తేదీ ఉదయం 10 గంటలకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి సబీహా పర్వీన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మరియు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమం మరియు దేశంలో విద్యా సంస్కరణలకు భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుంటారని కావున నంద్యాల జిల్లాలోని మైనారిటీ వర్గాల ప్రజలు, విద్యావేత్తలు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మరియు నంద్యాల జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీమతి సబీహా పర్వీన్ కోరారు.ఈ కార్యక్రమంలో అస్ముద్దీన్, కాబోలు ఇలియాస్, షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా), బెండకాయల ఇస్మాయిల్, అబ్దుల్ సలాం మౌలానా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top