PS Telugu News
Epaper

హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన గంగాపురం శివకుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం

📅 08 Nov 2025 ⏱️ 2:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

మొత్తం రూపాయలు 1,30,100/-(ఒక లక్ష ముప్పై వేల ఒక వంద)

( పయనించే సూర్యుడు నవంబర్ 08 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన గంగాపురం శివకుమార్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.బాబు 4 సంవత్సరా లు,పాపా 3 సంవత్సరాలు డ్రైవర్ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో,గత నెల 31/10/2025 నాడు శివకుమార్ హాట్ స్ట్రోక్ తో చనిపోయాడు. అతని కుటుంబ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని గమనించిన స్నేహితులు, మేమున్నామంటూ వారి శక్తి కొలది ఆర్థిక సహాయం చేయడం జరిగింది.
అందులో భాగంగా..

డ్రైవర్స్ యూనియన్ వారు, 56600/-

శివకుమార్ ఎస్ ఎస్ సి ఫ్రెండ్స్ 56500/-

మిత్ర ఫౌండేషన్ బూర్గుల వారు 17000/-

మొత్తం రూపాయలు 1,30,100/-
ఇ మొత్తం రూపాయలను వారి భార్య గంగాపురం నాగమణి పేరుమీద ఎల్ఐసి చేసి బాండును అందించడం జరిగింది. ఇంత మంచి ఆలోచన చేసి వారికి ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరిని గ్రామస్తులు అభినందించారు.

Scroll to Top