ఆత్మీయుల మధ్య ఘోరం: ప్రియుడి సహకారంతో భార్య భర్త హత్య చేసిన ఘటన
పయనించే సూర్యుడు న్యూస్ :యూపీలో దారుణం చోటు చేసుకుంది. మీరట్‌కు చెందిన అంజలి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ఓ మహిళ తన ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న భర్తను భర్తను ప్రియుడితో హత్య చేయించింది. ఆ వ్యక్తి మృతదేహం అతని గ్రామ శివారులో ఉన్న పొలంలో గుర్తించారు. అంజలి తన భర్త రాహుల్‌తో కలిసి ఇన్ స్టా రీల్స్ చేసేది. నువ్వు అందంగా ఉన్నావ్.. నీ భర్త అంకుల్ లా ఉన్నాడు అని కామెంట్ రావడంతో అంజలి సహించలేకపోయింది. అదే గ్రామానికి చెందిన అజయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను తుపాకీతో కాల్చి చంపింది. పోలీసులు నిందితులు అంజలి, అజయ్‌ను అరెస్ట్ చేశారు. మొదట్లో, హత్య వెనుక దోపిడీ ఉద్దేశ్యం అని పోలీసులు భావించారు. అయితే తదుపరి విచారణ వేరే కథనాన్ని చూపింది. బాధితురాల భార్యను పోలీసులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. ఆమె అగ్వాన్‌పూర్ గ్రామంలోని తన ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని తేలింది. ఆ తర్వాత అంజలి అనే మహిళ అదే గ్రామానికి చెందిన అజయ్ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు అజయ్ కూడా అతని ఇంట్లో లేడు. ఆ తర్వాత ఈ జంట అజ్ఞాతంలో కలిసి కనిపించింది. పోలీసుల విచారణలో నిందితుడు అజయ్ అసలు నిజాలు బయటపెట్టాడు. రాహుల్‌కు అక్రమ సంబంధం గురించి తెలిసిందని, దీంతో అంజలి తీవ్ర మనస్తాపానికి గురై అతడిని చంపేందుకు పథకం పన్నిందని చెప్పాడు. వాళ్ల ప్లాన్ ప్రకారం అజయ్, రాహుల్‌ని పొలాల దగ్గర కలవమని అడిగాడు. అక్కడికి రాగానే అతడిపై మూడుసార్లు కాల్పులు జరిపినట్లు విచారణలో తేలింది.