పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలోని మున్సిపాలిటీ కి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన ఎటువంటి అభివృద్ధి జరుగుటలేదు.పట్టణం లోని ఒక్క బస్తీ లో కూడా సీసీ రోడ్డులు మరియు డ్రైనేజ్ వ్యవస్థ చాలా కుంట పడడం జరిగింది.భైంసా మున్సిపాలిటీలో జనతా సర్కార్ కొలువు తీరిన తర్వాత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ స్వార్థం కొరకు వాళ్ళ స్వంత లాభం కొరకు పనులను చేసుకోవడం జరుగుతుంది.భైంసా పట్టణ అభివృద్ధి కొరకు ముధోల్ ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చేర్మెన్ ఇద్దరు ఒకే పార్టీ కి చెందిన వారు అయ్యి ఉండి కూడా పట్టణ అభివృద్ధి కావడం లేదు. అదే భైంసా పట్టణంలోని ఖాన్ ఆటో నగర్ లో సీసీ రోడ్డు మాత్రం పూర్తి అవ్వడం జరిగింది.ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా అభివృద్ధి ఎందుకు కావడం లేదు. భైంసా పట్టణాన్ని అభివృద్ధి కాకుండా అపుతున్నది ఎవరు.ఈ విషయంలో మున్సిపల్ చైర్మన్ మరియు ముధోల్ ఎమ్మెల్యే ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పైసా పట్టణ మాజీ కౌన్సిలర్లు మరియు బీజేపీ పార్టీ అభిమానులు మరియు పట్టణ అభివృద్ధి కొరకు పోరాటం చేస్తామని అన్నారు.