తెలంగాణ

దొడర్నా తండా జగదాంబ మాత, హనుమాన్ ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ సీనియర్ బిజెపి నాయకులు భోస్లే మోహన్‌రావు పాటిల్

దొడర్నా తండా జగదాంబ మాత, హనుమాన్ ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న ప్రజా ట్రస్ట్ చైర్మన్ సీనియర్ బిజెపి నాయకులు భోస్లే మోహన్‌రావు పాటిల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కుబీర్ మండలం, దొడర్నా తాండ నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ మాత విగ్రహం, హనుమాన్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే జై జగదాంబ మాత, సేవాలాల్ మహారాజ్ మందిరాల కలశ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రజా ట్రస్ట్ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు భోస్లే మోహన్‌రావు పాటిల్ హాజరయ్యారు. నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి, గ్రామ ప్రజల సుఖసంతోషాల కోసం ప్రార్థించారు ఈ సందర్భంగా మోహన్‌రావు పాటిల్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS