పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ పట్టణంలోని వినాయక మండపాలను గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అనంతరం ఆయా వినాయక మండపాల నిర్వాహకులు మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తో పాటు కౌన్సిలర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, పెండం శ్రీనివాస్, లక్కాకుల హరీష్, ఆకుల రామకృష్ణ,చెనిగరపు నరేష్, రావులవార్ విట్టల్,మాజీ కౌన్సిలర్ తారక రఘు తదితరులు పాల్గొన్నారు.