PS Telugu News
Epaper

HRPC కడప జిల్లా ఎడ్యుకేషన్ సెల్ చైర్మన్ గా ఎన్నికైన గురివిగారి వాసు

📅 02 Feb 2026 ⏱️ 2:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

.జనం న్యూస్ నందలూరుకడప జిల్లా.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ వస్తావ్యుడు గురివిగారి వాసు మాట్లాడుతూ “హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” కడప జిల్లా ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా నన్ను ఎన్ను కున్నందుకు “మా ప్రియమైన మానవ హక్కుల పరిరక్షణ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసనకుమార్ కి రాయలసీమ చైర్మన్ నెసే జాన్ కి ,జిల్లా అధ్యక్షులు Dr.డేవిడ్ కళ్యాణ్ రాజ్ కి, రాయలసీమ క్రైమ్ అండ్ డ్రగ్స్ చైర్మన్ వీరబల్లి జయకుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసు కుంటున్నాను.జిల్లా లో సంస్థ ఎదుగుదల కోసం అలాగే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి చదువు యొక్క గొప్ప తనం సమాజంలో చదువు వల్ల అసమానతలు తొలగి పోతాయి అని వారికి చదువే ఒక ఆయుధం అని వారి పిల్లలకి అందవలసిన హక్కులని అందరూ పొందే విధంగా చేస్తానని అలాగే జిల్లాలో నేను ఎడ్యుకేషనల్ సెల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నాను నా పరిధిలో ఎక్కడైనా పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు సమస్యలు ఉంటే అవి న్యాయ బద్ధంగా ఉంటే మా వద్దకు తీసుకొని వస్తే వారికి HRPC తరుపున మేము అండగా ఉండి న్యాయం జరిగేలా చేస్తాము అని ఈ సందర్భంగాతెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో రాచూరి మురళి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు మరియు జనసేన నాయకులు అరుణ్ పాండే, బన్నీ, హర్ష వర్ధన్, టీడీపీ నాయకులు సుదర్శన్, నందలూరు ఉప సర్పంచ్ ఇబ్బు మరియు పత్రిక విలేకర్లు కిరణ్,మెహర్ హాజరు అయ్యారు.

Scroll to Top