తెలంగాణ

నీటి మీద రాతలతో వాగ్దానాలు చేయబోతున్నారు తస్మా జాగ్రత్త ప్రజలారా

నీటి మీద రాతలతో వాగ్దానాలు చేయబోతున్నారు తస్మా జాగ్రత్త ప్రజలారా

పయనించే సూర్యుడు అక్టోబర్ 16 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ తాళ్లూరి దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం పరిధిలో అభివృద్ధి చేస్తామని ఎన్నికల వాగ్దానాలు చేసి ప్రజలను ఏమార్చి వారికి ఈసారి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని కథలు చెబుతూ కాలం గడిపే వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని ప్రజలు వేచి ఉన్నారు ఈ ఎన్నికల సందర్భంగా ఇటు పాలకపక్షమైనా ప్రతిపక్షమైన ప్రజల వద్దకు వెళ్లి ఏమి చేశామని ఓట్లు అడగబోతున్నారు వేచి చూడాలి సూళ్లూరుపేట పట్టణం మేజర్ పంచాయతీ గా ఉండి మున్సిపాలిటీ గా మారి దాదాపు 15 సంవత్సరాలు పూర్తయింది అంటే రెండు ఎన్నికలు పూర్తిగా చూసి మూడో ఎన్నిక ను చూడబోతోంది ముగిసిన రెండు ఎన్నికలలో గెలిచిన ఇద్దరు రెండు వర్గాల మున్సిపల్ చైర్ పర్సన్ సూళ్లూరుపేట పట్టణ వాసులకు ఇచ్చిన వాగ్దానం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి చూపిస్తామన్నారు అది కాలం చెల్లిన మాటగానే మిగిలిపోయింది రెండవ వాగ్దానం సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని పన్ను చెల్లింపుదారులుండే అన్ని మార్గాలను సిమెంట్ రోడ్లుగా మారుస్తామన్నారు అది కూడా అలాగే కంటిచూపు చర్యగా మిగిలిపోయింది మూడవది పట్టణ పరిధిలో అందరికీ మంచినీరు కులాయి ద్వారా అందిస్తామన్నారు అది కూడా కలగానే మిగిలిపోయింది నాలుగవ వాగ్దానం పట్టణంలో పరిశుభ్రతకే ముఖ్యత్వాన్ని ఇస్తూ ప్రతి వీధికి మురుగునీటి కాలువను కచ్చితంగా ఏర్పాటు చేస్తూ వీధివీధిన చెత్తను నిలువ లేకుండా ఎత్తివేస్తూ వాటిని రీసైక్లింగ్ చేసి వాటి ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని చేస్తామని కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని పట్టణ పరిధిలో పార్కింగ్ ప్లేస్ లు చూపిస్తామని ఇలా జరగనివన్నీ మాటలుగా చెప్పి మాజీలు గా మారిపోయిన నాటి నాయకులు బిజీగా తిరుగుతున్న నేటి నాయకులు ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో నాడు నేడు చూస్తూ ఉన్న ఈ స్థానిక ప్రజలకు ఇంకేమని చేయలేని వాగ్దానం చేయబోతున్నారు.. మున్సిపల్ చట్ట ప్రకారం ప్రతి వీధికి ప్రాథమిక సౌకర్యాలైన మురుగునీటి కాలువ తాగడానికి నీరు నడిచేందుకు ఆహ్లాదకరమైన రోడ్డును ఇచ్చి ఇంటి పన్ను వసూలు చేయాలన్న విధివిధానాలనే మార్చేసిన మీ మాటల నైపుణ్యంతో ప్రజలను ఇంకా ఎంతకాలం ఏ మారుస్తారు ఈసారి నిజంగా ఇచ్చిన వాగ్దానాలను చేసిన వారికే మా ఓటు అని ఓటర్ మహాశయలు కాచుకొని కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఏమని మీరు ఓటు అడుగుతారో ఈ స్థానిక ప్రజలు చూడబోతు న్నారు..?

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS