ఆలమూరు భట్టీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు
వైభవంగా స్వామి వారి అన్నాభిషేకం పయనించే సూర్యుడు, జనవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ఆలమూరులో అత్యంత పురాతనమైన, దక్షిణ భారతదేశంలో ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందిన విక్రమభట్టీశ్వరస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ధనుర్మాసం ఆరుద్ర దర్శనం సందర్భంగా నిర్వహిస్తున్న అన్నాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారుకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]




