మూడవ అంగన్వాడి సెంటర్లో పోషణ మహోత్సవం
(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలంలోని అంగన్వాడి మూడవ సెంటర్లో పోషణ మహోత్సవంలో భాగంగా గర్భవతులు బాలింతలు మరియు కిశోర బాలికలకు ఆరోగ్యము మరియు పరిరక్షణ పిల్లల ఎదుగుదల పైన అవగాహన కల్పించడం జరిగింది. కిషోర్ బాలికలు గర్భవతులు బాలింతలో మరియు పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. రోజు తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృతులు విటమిన్స్ ఖనిజలవనాలు వాటితో పాటుగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. […]




