రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
అనుచరుడి చేతిలో హతం కుషాయిగూడలో కలకలం పయనించే సూర్యడు/ సెప్టెంబర్ 13/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరుడి చేతిలోనే నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం హతుడైన శ్రీకాంత్ రెడ్డి (45) హెచ్‌బీ కాలనీ, మంగాపురం కాలనీ, కుషాయిగూడలో కుటుంబంతో నివాసముంటూ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. […]




