PS Telugu News
Epaper

శవాన్ని కెనాల్ లో పారేసిన పోలీసులు.. బూతులు తిడుతున్న ప్రజలు.. అందరినీ సస్పెండ్ చేసిన ఎస్పీ.. (వీడియో చూడండి)

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం తప్పు జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఆ తప్పు పై నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తప్పు చేసిన వారిని ఏకిపారేస్తుంటారు. ఆ తప్పు చేసింది ఎవరని కూడా చూడరు వాళ్ళను ఒక రేంజ్ లో ఆడేసుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో పోలీసులు చేసిన పనికి అంతా షాక్ అయిపోతున్నారు. ఇది చూసిన నెటిజన్లు పోలీసులు చేసిన నిర్వాకంపై ఫైర్ అవుతున్నారు. బీహార్ లోని ముజఫర్ అనే ఊర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రమాదంలో ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు కాలువలో పడేశారు. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆ తతంగం మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో డిఎస్పి వద్దకు చేరుకుంది. పోలీసుల తీరుపై ఫైర్ అయిన డీఎస్పి బాడీని వెలికి తీయించారు. ఘటనకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేశారు. మృతదేహం ఎవరిదో గుర్తించి పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ వీడియో పైన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాల్సింది పోయి పక్కనే ఉన్న కాలువలో పడేసిన పోలీసులు నిర్వాకం చూసి ఫుల్ ఫైర్ అవుతున్నారు. పోలీస్ సిబ్బంది ఉన్నది ప్రజల సంరక్షణ కొరకే కదా మీరే ఇలా చేస్తే ప్రజా సంరక్షణను ఎవరు చూసుకుంటారు అని నెటిజన్లు వాపోతున్నారు. మొత్తానికి ఆ పోలీసులు చేసిన నిర్వాకం దేశమంతట సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియా ద్వారా అది మరింతగా వైరల్ అయింది.

Scroll to Top