తెలంగాణ

సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.

సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.

తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వ్యక్తి – బ్యాంకు లావాదేవీల ఆధారాలు సమర్పిస్తానని వెల్లడి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ వ్యవహారాలతో గానీ, ఆ సంస్థకు సంబంధించిన ఇతర కార్యకలాపాలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ వ్యక్తి స్పష్టం చేశారు. ఈ మేరకు తనపై వస్తున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు.2018లో కార్యాలయ స్థలం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థకు తన బ్యాంకు ఖాతా ద్వారా రూ.2.10 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. అయితే సంబంధిత సంస్థ స్థలాన్ని కేటాయించలేకపోవడంతో, తాను చెల్లించిన రూ.2.10 కోట్ల మొత్తాన్ని తిరిగి తన బ్యాంకు ఖాతాలోకి జమ చేసినట్లు వివరించారు.ఈ మొత్తం లావాదేవీలు పూర్తిగా బ్యాంకింగ్ మార్గంలోనే, పారదర్శకంగా జరిగినవేనని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీల రికార్డులతో పాటు అవసరమైన అన్ని ఆధారాలను విచారణ సంస్థలకు సమర్పించేందు కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా కొందరు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. సంబంధిత వ్యవహారంపై జరుగుతున్న విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.తనకు సాహితీ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేస్తూ, తన వద్ద ఉన్న లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు అవసరమైన సందర్భంలో సమర్పిస్తానని తెలిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS