ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన బిజెపి చీకరమెల్లి శ్రీనివాసరావు
పయనించే సూర్యుడు సెప్టెంబర్23: ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 25 సంవత్సరాల సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా పి.గన్నవరం మండలం వై.వి.పాలెం గ్రామంలో ప్రభుత్వ వైద్య శిబిరం నిర్వహించారు.మండల వైద్యాధికారి డాక్టర్ రియాజ్ తున్నిసా బేగం పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరాన్ని బిజెపి మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించారు.ఈ సందర్భంగా ఆరోగ్య ప్రతిజ్ఞ చేయించి,సంజీవిని వైద్య వాహనం ద్వారా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ఉచిత శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, షుగర్, బిపి, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మెరుగైన వైద్యం పొందవచ్చని తెలిపారు.వైద్యాధికారి రియాజ్ తున్నిసా బేగం మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని,పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిహెచ్.కాంతిర్మయి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మేడిది సత్యనారాయణ,మాజీ కార్యదర్శి అడ్డాల వెంకటేశ్వరరావు,ఏఎన్ఎం పి.శాంతి,ఆశా కార్యకర్తలు యన్నపు నాగమణి,జంగా బేబీ,కటికిరెడ్డి చంటి,పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.