మెస్సీ టూర్లో అవాంతరాలు.. అభిమానులకు క్షమాపణ చెప్పిన సీఎం
పయనించే సూర్యుడు న్యూస్ :గోట్ ఇండియా టూర్లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్‌కతాలోని స్టాల్‌లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్‌గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ మ్యాచ్ చూద్దామని వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. ప్లేక్సీలు, కటౌట్లు చించేవారు. కొన్నింటింని అంటించేశారు.దీందో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. ఇక ఘటనపై ఫ్యాన్స్ మాట్లాడుతూ.. మెస్సీని చూసేందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చామని.. ఒక్కో టికెట్‌ను రూ.5 నుంచి 45 వేల ఖచ్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటి కనీసం ఆయన్ను ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.ఇదిలా ఉండగా ఈ సంఘటన రాష్ట్ర గవర్నర్ సీరియస్ అయ్యారు. మీ టూర్ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. మెస్సీ టూర్లో జరిగిన గందరగోళానికి క్షమించాలని ఆమె అభిమానులను కోరారు. అలాగే మెస్సీ టూర్లో నిర్వహణ లోపంపై విచారణకు ఆదేశించారు. ఇందుకోసం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేశారు.ఇక మెస్సీ కోల్‌కతా టూర్లో జరిగిన గందరగోళంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నిమిషం నుంచి మళ్లీ వెళ్లేంతవరకు మూడంచల బద్ధతను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం జెడ్ కేటగిరి భద్రతతో పాటు ప్రత్యేక బలగాల మోహరించారు. 20 వెహికల్స్ కాన్వాయ్‌తో మెస్సీని ఎయిర్ పోర్టు నుంచి ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత మెస్సీ వెళ్లనున్న పలక్నామా ప్యాలెస్ దగ్గర సైతం భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. ఆయన హైదరాబాద్.. తిరిగి వెళ్లేంత వరకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని భద్రతా ప్రమాణాలను పోలీసులు పాటిస్తున్నారు.