200 కి.మీ. పొడవున విస్తరించిన భూగర్భ గ్రామం: 20 ఏళ్లుగా కొనసాగుతున్న నివాసం
పయనించే సూర్యుడు న్యూస్ :భారతదేశంలో వందలాది గ్రామాలు ఉన్నాయి. బహుశా మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి ఉంటారు. ఈ గ్రామాలన్నింటిలో మీరు పచ్చదనం, చెట్లు, మట్టి, ఇటుక, పెంకుటిళ్ళు, పశువులను చూస్తారు. కానీ, ప్రపంచంలో ఒక గ్రామం ఉంది. అది ఆకాశం కింద కాదు, భూగర్భంలో ఉంది. ఒకప్పుడు వందలాది మంది అక్కడ నివసించారు. ఈ గ్రామం 200 కిలోమీటర్ల పొడవైన సొరంగం లోపల నిర్మించబడింది. ఇది పాఠశాలలు, ఆసుపత్రులు వంటి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఇది ఏ గ్రామం, ఇది ఎక్కడ ఉంది? దాని గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..ఆమె ఇటీవల ప్రపంచంలోని ఒక ప్రత్యేకమైన గ్రామం గురించి వివరించే వీడియోను పోస్ట్ చేశారు. ఈ గ్రామం నిజానికి వియత్నాంలోని కు చి టన్నెల్స్. వియత్నాం యుద్ధ సమయంలో సైనికులు, ఇతర పౌరులు ఈ రహస్య స్థావరాన్ని నిర్మించారు. వారు అమెరికన్ సైనికులకు దొరకకుండా ఉండేందుకు సంవత్సరాల తరబడి ఈ టన్నెల్స్ లోపల నివసించారు.