Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కోరంకనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కోరంకనకయ్య జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

Listen to this article

పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు:- టేకులపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు,రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను ఆదివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మరియు భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ ప్రారంభించారు పైలెట్ ప్రాజెక్టు ఎన్నికైన కోయగూడెం పంచాయతీ లో ఎంపికైన కుటుంబాలకు వారు అర్హత పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ. అర్హులైన ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని వారు తెలియజేశారు. గత పాలకులు చెప్పింది కొండంత చేసింది గోరంత అని వారిని ఎద్దేవ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను నెరవేరుస్తుందని పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓర్వలేక గ్రామ సభలో అల్లర్లు సృష్టిస్తున్నారని. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు . అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు వస్తాయని ఎవరు నిరాశ చెందాల్సిన పనిలేదని మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఇది నిరంతర ప్రక్రియ అని ప్రజలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ నాయకులు కోరం సురేందర్ ఇల్లందు డి.ఎస్.పి చంద్ర బాను ,తహసీల్దార్ నాగ భవాని, ఎంపీడీవో రవీందర్రావు , ఎం పి ఓ గణేష్ గాంధీ , ఏపీవో కళింగ శ్రీనివాస్ , ఎంఏవో అన్నపూర్ణ, కోయగూడెం మాజీ సర్పంచ్ ఉమా – సురేందర్ సీఐ తాటిపాముల సురేశ్ బోడు ఎస్ఐ శ్రీకాంత్, టేకులపల్లి మండల అధ్యక్షులు దేవానాయక్, ఈది గణేష్, మంగిళాల్,సర్దార్, రవి,బండ్ల రజినీ, బండ్ల శ్రీనివాసరావు,లక్కినేని శ్యామ్, మురళీ,జాల మురళీ, ఉదయ్,బొడ్డు అశోక్, హనుమంతు, బన్సీ లాల్, కోటి, విజయ్, మూడు గణేష్, నాగేశ్వరావు, కొప్పుల సురేష్ . కాంగ్రెస్ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments