అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ కాట్రేనికోన చిన్నారిని అభినందించిన గుత్తులు సాయి

June 13, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూన్ 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్య క్షులు గుత్తుల సాయి శ్రీనివాస్అంబేద్కర్ కోనసీమ జిల్లా,కాట్రేనికోన గ్రామ చిన్నారి విత్తనాల కుశాల్ నాగ వెంకట్ (8 ) అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కి ఎక్కి రికార్డు సృష్టించడం పట్ల ,కోనసీమ జిల్లా టీడీపీ అధ్య క్షులు గుత్తుల సాయి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న ఈ చిన్నారి 1-80 వర్గ సంఖ్య విలువలు కేవలం 1 నిమిషం 29 సెకన్ల 33 మిల్లి సెకన్ల కాలవ్యవధిలో ప్రపంచం లోనే వేగవంతంగ చెప్పిన చిన్నరిగా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డు లలో అవార్డు సంపాదించుకున్నాడు. గతంలో ఈ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన విషయం అందరికి తెలిసిందే. విద్యార్థి, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు చేజిక్కించుకొని జిల్లాకు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సాయి గారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన కుశాల్ నాగ వెంకట్ ను , తల్లిదండ్రులను అభినందించారు .

🌐 Select Language:
📰 ePaper