నిర్మల్ పట్టణంలో కోతుల పట్టివేత కార్యక్రమం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ పట్టణంలోని వార్డ్ నెం. 7 షేక్ సాహబ్ పేట్ లో కోతుల పట్టివేత కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.నిర్మల్ పట్టణంలోని షేక్ సాహబ్ పేట్ లో నిర్వహించిన ప్రత్యేక కోతుల పట్టివేత కార్యక్రమంలో మొత్తం 62 కోతులను పట్టుకొని కవ్వాల్ అటవీ ప్రాంతానికి సురక్షితంగా తరలించారు.పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న కోతుల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమం మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించ బడింది. పట్టుబడిన కోతులను కవ్వాల్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తబ సుo షాకీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు