అక్రిడేషన్ కార్డుల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
అర్హత గల జర్నలిస్టులందరికీ “అక్రిడేషన్లు” ఇవ్వాలనీ షాద్ నగర్ టిడబ్ల్యుజేఎఫ్ కమిటీ వినతి
పాత పద్ధతుల్లోనే కార్డులు ఇవ్వాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం.డి ఖాజాపాషా వినతి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్న బాధ్యతగల జర్నలిస్టులకు అర్హులైన వారందరికీ అక్రిడేషన్ ప్రభుత్వ కార్డులు అందుతాయని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) డివిజన్ అధ్యక్షుడు జే రాఘవేందర్ గౌడ్, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజాపాషా (కేపీ), సీనియర్ జర్నలిస్టు కస్తూరి రంగనాథ్, రాకేష్, సాయి రెడ్డి, బూరుగుల రమేష్, మల్చలం రమేష్, షకీల్, రియాజ్, జగన్, విష్ణు, రవితేజ, రాకేష్, శివ, ఆవుల రమేష్, సమీ, నరేందర్, భాస్కర్, శ్రావణ్ గౌడ్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ వినతిపత్రం స్వీకరించి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను ఆకలింపు చేసుకొని వారికి తగిన విధంగా గౌరవ మర్యాదలతో వారికి కావలసిన రీతిలో నూతన నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా ఎవరికి పడితే వారికి అర్హత లేని వారికి ఎంతో మందికి కార్డులు మంజూరయ్యాయని జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వం తీసుకువచ్చాయన్న విషయాన్ని వివరించారు. ఇలాంటి సమయంలో ప్రక్షాళన చేపట్టి జర్నలిస్ట్ సంఘాల అనుమతి వారి సూచన సలహాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. నూతన నిబంధనల వల్ల ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు అందే విధంగా కృషి చేస్తామని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎండి ఖాజాపాషా కేపి, డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి తమ సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులో సంబంధించిన అక్కడ వ్యవహారంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఆయా సంఘాలతో మాట్లాడి మీడియా అకాడమీతో చర్చించి అందరికీ అర్హులైన వారికి కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అనేక సందర్భాల్లో ముఖ్యమతి రేవంత్ రెడ్డి మీడియా విలువల గురించి ప్రస్తావించారని వాటిని అన్ని జనుల సంఘాలు ఆహ్వానించాయని తప్పకుండా విలువలతో కూడిన ప్రయత్నం చేసి అర్హులైన జర్నలిస్టులకు కార్డులు అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడేషన్ కార్డులలో నియోజకవర్గస్థాయిలో కోత విధించకుండా హెడ్ క్వార్టర్ల పేర్లు వచ్చే విధంగా కార్డులు ఉండాలని కేవలం మండలాలను పేరు పెట్టడం ఒకటే సరికాదని నియోజకవర్గస్థాయిలో ఉన్న పేర్లను కూడా పట్టణ రూరల్ స్థాయి విలేకరులకు కూడా అక్కడేషన్ కడులు మంజూరు చేయాలని కోరారు..
