అనాథ వృద్ధుడికి హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు

August 13, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో : భైంసా పట్టణంలో అనాథగా జీవిస్తున్న సుమారు 70 ఏళ్ల వృద్ధుడు బుధవారం రాత్రి మృతి చెందాడు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు చికిత్స అందించారు. అనంతరం వృద్ధుడి మృతికి సంబంధించిన విషయాన్ని డాక్టర్ కాశీనాథ్‌కు వివరించడంతో, పుష్పక్ ఫౌండేషన్ సోషల్ సర్వీసెస్ చైర్మన్ బాలాజీ సూత్రావేకు సమాచారం అందించారు.ఈ విషయం తెలుసుకున్న బాలాజీ సూత్రావే వృద్ధుడి మృతదేహాన్ని స్వీకరించి, మానవతా దృక్పథంతో హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అనాథగా మృతి చెందిన వృద్ధుడికి చివరి వీడ్కోలు పలికి, అంతిమ సంస్కారాలు నిర్వహించడం పట్ల పలువురు అభినందించారు.ఈ సందర్భంగా బాలాజీ సూత్రావే మాట్లాడుతూ, అనాథగా మృతి చెందిన వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వృద్ధుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.అనాథలకు, నిరాశ్రయులకు అండగా నిలుస్తూ మానవతా సేవలు అందిస్తున్న పుష్పక్ ఫౌండేషన్ సేవలను పలువురు ప్రశంసించారు.

🌐 Select Language:
📰 ePaper