ఎర్రగరువు మావుళ్ళమ్మకు ఆషాడం సారె.
పయ నించే సూర్యుడు ఆగస్టు 12 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)ఐ పోలవరం మండలం జి మూలపొలం పంచాయతీ ఎర్రగరువు గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ గ్రామ దేవతకు గ్రామస్తులు మాతృమూర్తులు అమ్మవారికి ఆషాడం సారె సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు ముందుగా శ్రీకృష్ణ మందిరం నుండి సారె కావిడలను తీసుకుని బాజా బయింద్రీలతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారి సన్నిధి చేరి ముందుగా పసుపు నీళ్లు సమర్పించి ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఆధ్వర్యంలో కుంకుమార్చన పుష్పార్చన పూజా కార్యక్రమాలు ముగించి సారె సమర్పించినారు. డాక్టర్. రెడ్డి నాగభూషణం మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ఆధారంగా హిందూ ధర్మ పరిరక్షణ గావించాలన్నారు మన ఆచార సంప్రదాయాలను మన క్రింది తరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మందపాటి భైరవస్వామి గాలి కృష్ణమూర్తి మందపాటి నాగబాబు గంగుల వెంకటేశ్వరరావు శిరింగు సుబ్బారావు పల్ల శ్రీనివాసరావు తానింకి బాబ్జి గంగుల శ్రీనివాసరావు మలసాని భాస్కరరావు కూరాకుల కిరణ్ కొప్పిశెట్టి భైరవస్వామి మందపాటి లక్ష్మి తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.