300 మీటర్ల భారీ జాతీయ జెండాతో ఘనంగా తిరంగా ర్యాలీ

August 12, 2026 | ఆంధ్రప్రదేశ్

దేశభక్తిని చాటుకున్న విద్యార్థులు, ప్రజలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి

కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం

జనం న్యూస్ ఆగస్టు 12: ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామచంద్రపురం పట్టణంలోని విజ్ఞానభారతి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీ అత్యంత ఘనంగా జరిగింది. దేశభక్తి నినాదాలు, జాతీయ జెండాల రెపరెపల మధ్య సాగిన ఈ ర్యాలీ పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం మనకు ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితంగా లభించిందని, దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని, యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదుగుతున్న ఈ సమయంలో దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు.విద్యార్థుల్లో దేశభక్తి భావన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, జాతీయ పతాకం ప్రతి భారతీయుడి గౌరవానికి ప్రతీక అని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించి దేశభక్తి స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు దునే శ్రీనివాసు, మాజీ పట్టణ అధ్యక్షులు కేసవ రాఘవేంద్రరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు, జిల్లా స్వచ్ఛ భారత్ కన్వీనర్ సలాది సతీష్ నాయుడు, సీనియర్ నాయకులు కుప్పెల సూర్యనారాయణ, యాండ్ర బుల్లబులు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్, జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్, కృతివెంటి పేర్రాజు పంతులు చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ సలాది వెంకప్పనాయుడు, విజ్ఞానభారతి పాఠశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు మరియు పెద్ద సంఖ్యలో దేశభక్తులు పాల్గొని తమ దేశప్రేమను చాటుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper