తెలంగాణ

ముఖ్యమంత్రి ఆదేశాలతో కూనవరం–గచ్చికాయలపొర డ్రైన్‌లో పూడికతీత _

ముఖ్యమంత్రి ఆదేశాలతో కూనవరం–గచ్చికాయలపొర డ్రైన్‌లో పూడికతీత _

10.236 కిలోమీటర్ల డ్రైన్‌లో 2.6 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పూర్తి.. మరో 600 మీటర్ల మేర మొగ ద్వారా క్లియరెన్స్_

పయనించే సూర్యుడు అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో కాట్రేనికోన మండలంలోని గచ్చికాయలపొర ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానిక బాధితులు కూనవరం నుంచి గచ్చికాయలపొర వరకు ఉన్న డ్రైన్‌లో పూడికతీత పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌ను తక్షణమే పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10.236 కిలోమీటర్ల పొడవైన కూనవరం–గచ్చికాయలపొర డ్రైన్‌లో పూడికతీత పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 2.6 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ పనులు పూర్తిచేయగా, మరో 600 మీటర్ల మేర మొగ ద్వారా డ్రైన్‌ను క్లియర్ చేశారు. డ్రైన్‌లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూడికతీత పనులు చేపడుతున్నారు. తద్వారా పరిసర గ్రామాల్లో వర్షాలు, వరదల సమయంలో ఏర్పడే ముంపు సమస్యలను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS