సినిమా వార్తలు

అమలాపురం 28వ వార్డు విజేత మోకా వెంకట సుబ్బారావుకు స్వగ్రామంలో ఘన సత్కారం

అమలాపురం 28వ వార్డు విజేత మోకా వెంకట సుబ్బారావుకు స్వగ్రామంలో ఘన సత్కారం

పయనించే సూర్యుడు అక్టోబర్ ఐదు ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో 110 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి మోకా వెంకట సుబ్బారావు తన స్వగ్రామం కాట్రేనికోనకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు, కార్యకర్తలు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన చిన్ననాటి మిత్రుడు, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ ట్రెజరర్ గ్రంధి నానాజీని మర్యాదపూర్వకంగా కలిశారు. కాట్రేనికోనలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీలో మేమిద్దరం కలిసి పని చేశామని, ఆ అభిమానంతోనే నానాజీని కలవడానికి వచ్చానని మోకా వెంకట సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రంధి నానాజీ మోకా వెంకట సుబ్బారావు కు చిరు సత్కారం చేసి అభినందనలు తెలిపారు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మోకా వెంకట సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పసర్ల నాయుడు, ముమ్మిడివరం మార్కెటింగ్ యార్డ్ డైరెక్టర్ మట్ట సూరిబాబు, పోలవరపు చంటి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS