అమలాపురంలో సుకన్య సమృద్ధి, పోస్టల్ బీమా పథకాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

June 22, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అమలాపురం, : భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ కొనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మీరావు అధ్యక్షతన గురువారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ బీమా పథకాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా తపాలా శాఖ అభివృద్ధి అధికారి శ్రీ పవన్ కుమార్ సారథ్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ పోస్టల్ పొదుపు, బీమా పథకాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ పలువురు లబ్ధిదారులకు సుకన్య సమృద్ధి యోజన ఖాతాల నమోదు, పోస్టల్ బీమా పథకాల నమోదు కార్యక్రమాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ, దేశంలోని ప్రతి కుటుంబంలో ఆడపిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండాలని, వారు మహారాణుల్లా జీవించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుకన్య సమృద్ధి యోజనను ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు బాలికల విద్య, వివాహ అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోస్టల్ బీమా, పొదుపు పథకాలు ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తున్నాయని పేర్కొన్నారు.జిల్లా తపాలా శాఖ అభివృద్ధి అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ, సుకన్య సమృద్ధి యోజన దేశంలోనే అత్యంత ప్రయోజనకరమైన పొదుపు పథకాలలో ఒకటని, తల్లిదండ్రులు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ పథకంలో చేరాలని సూచించారు. పోస్టల్ బీమా పథకాల ద్వారా తక్కువ ప్రీమియంతో మెరుగైన బీమా రక్షణ పొందవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమిల్లి శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్, అమలాపురం టౌన్, రూరల్, పి.గన్నవరం, అంబాజీపేట, అల్లవరం మండలాల అధ్యక్షులు అయ్యల భాస్కరరావు, బొంతు శివాజీ, తిక్క సత్యనారాయణ, కురసా ఆంజనేయులు, కట్ట నారాయణ, షంసు సాదిక్, పావులూరి వెంకట్, జిల్లా ఆఫీస్ ఇన్చార్జీ డి.వి.ఎస్ రాజు, ఇళ్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి రామా వర్మ, చిలకమర్రి కస్తూరి, చిట్టురి రాజేశ్వరి, సానబోయిన సత్యనారాయణ, కట్ట ప్రసాద్, జాలెం ఈశ్వరరావు, కుడుపూడి గోపాలకృష్ణ, కట్ట జనార్ధన్, శిలం నరసింహం, బోర్రా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper