నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల వ్యాపారం అరికట్టాలితెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసి రామ్

June 22, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ కేంద్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులు మరియు బుక్స్, బ్యాగులు, యూనిఫాం అక్రమ విక్రయాలను, విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని దానితోపాటు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు నోటు పుస్తకాలు, అమ్మడం జరుగుతుంది ప్రైవేటు స్కూల్ యజమాన్యాలపే పరమైన చర్యలు తీసుకొని బయట అమ్ముతున్న షాపులను వెంటనే సీజ్ చేయాలని తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పల్లపు తులసీరామ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ విద్యా సంస్థలు ట్రేడింగ్ లైసెన్స్ లేకుండా, ఒరిజినల్ బిల్స్ ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంతో బుక్స్, యూనిఫామ్ షూస్, బ్యాగ్స్, స్టేషనరీ సామాన్లని బయట సెటర్లో పెట్టి విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. తెలియజేయడం జరిగింది. వాటిని వెంటనే సీజ్ చేసి వాటికి సంబంధించిన పాఠశాలల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసీరామ్ మరియు నిర్మల్ జిల్లా అధ్యక్షులు రత్నల్లి రాజశేఖర్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముల్క సందీప్, పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper